లోన్ యాప్ ఏజెంట్లు వేధిస్తే పోలీసులకు చెప్పండి !
1 min readపల్లెవెలుగువెబ్ : లోన్ యాప్ ఆగడాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సూచించారు. యాప్‌ల ద్వారా లోన్‌లు తీసుకుని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ముత్తుకూరులో గడపగడపకు కార్యక్రమంలో ఉండగా 79 కాల్స్ తన నంబర్కు వచ్చాయని తెలిపారు. లోన్ తీసుకున్న అశోక్ కుమార్ అనే వ్యక్తి ప్రత్యామ్నాయ నంబర్‌గా తన సెల్ నంబర్ ఇవ్వడంతో సదరు లోన్ యాప్ ప్రతినిథులు పలుమార్లు తనకు ఫోన్ చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురిని అరెస్ట్ చేశారని చెప్పారు. లోన్ యాప్ నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే పోలీసులకు లేదా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.