బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం
1 min read
పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త కు అండగా ఉంటా
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భవ వేడుకల్లో పాల్గొన్నా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం , న్యూస్ నేడు : సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని బడుగు బలహీన వర్గాల కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక టిడిపి నాయకులు అశోక్ రెడ్డి, వరదరాజు, కమసలి నరసింహ, డిసి తిమ్మప్ప, ఎంపిటిసి మేకల వెంకటేష్, మేకల నర్సింహ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. నేను తెలుగు వాడిని నాది తెలుగుదేశం పార్టీ అంటూ సరిగ్గా 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ తరువాత మన రెండు తెలుగు రాష్ట్రాల దిశ దశ మార్చి రాష్ట్రపతుల నియామకాలలో కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ పేరు వినిపించడం జరిగిందని తెలిపారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మూడవతరం నాయకుడు మన నారా లోకేష్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను కాపాడుకోవడానికి ప్రత్యేక సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసిన మానవతవాది మన లోకేశ్ అని అన్నారు. రాఘవేంద్ర స్వామి సాక్షిగా మంత్రాలయ నియోజకవర్గం లోని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మన యువ నాయకులు ఐటీ విద్యా శాఖ మంత్రి లోకేశ్ ఆశీస్సులతో అందర్నీ కాపాడుకుంటనాని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎవరికి ఏ అన్యాయం జరిగిన తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేష్, ఎస్ యం గోపాల్ రెడ్డి, ఎంపిటిసి మేకల వెంకటేష్, మేకల నర్సింహ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఛైర్మెన్ నరసింహులు, హనుమంతు రెడ్డి, చాకలి గురురాజ, విజయ్ కుమార్,డేవిడ్, శివ, శేఖర్, నరసింహులు, మండలం లోని గ్రామ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.