NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 41 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం నాడు జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం జరగాలని బడుగు బలహీన వర్గాల కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రభంజనంలా ప్రజాభిమానం చురగొని సమైక్య రాష్ట్రంలో పక్క తెలుగువాడి పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే పేద ప్రజలకు మేలు జరిగే పథకాలను కిలో రూపాయి బియ్యం తెలుగు గంగ ప్రాజెక్టు రైతులకు భరోసా ఇస్తూ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ వివిధ వృత్తుల వారికి పనిముట్లను ప్రభుత్వ సబ్సిడీతో ఇచ్చి వారి జీవన విధానాన్ని మెరుగుపరచిన ఒకే ఒక్క ప్రజా నాయకుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ రాబోయే 2024 ఎన్నికలలో అధికారంలోకి వస్తుందని మళ్లీ నారా చంద్రబాబునాయుడు ని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోబోతున్నారని పాణ్యం లో గౌరు చరితమ్మను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షులు అంగజల కృష్ణ యాదవ్ సీనియర్ నాయకులు పంట రామచంద్ర రెడ్డి సుదర్శన్ రెడ్డి: బత్తుల సుభద్రమ్మ. టిడిపి.సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్..హైమవతి… సీనియర్ టిడిపి నాయకురాలు.. వడ్డు లక్ష్మీదేవి.. టిడిపి మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఎస్ ఏ ఫరూక్ .. టిడిపి స్టేట్ మైనార్టీ సెక్రటరీ, కంది నాగరాజు రాచమల్ల శ్రీనివాస్ గారు శ్రీనివాస్ యాదవ్ . హర్షవర్ధన్, గంగాధర్ రెడ్డి గారు, ఐటీడీపి నియోజకవర్గం వైస్ ప్రసిడెంట్ రాజు, ఆర్గనైజషన్ సెక్రటరీ బాబు నాయక్ రంగస్వామి నాయక్ నారాయణ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author