ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. పార్టీ స్థాపించి నేటికీ 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 41 వసంతాలు పూర్తి అయి 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లోకి తారాజువ్వల దూసుకొచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే పార్టీ జెండా ఎగరేసిన యుగపురుషుడు నందమూరి తారక రామారావు పేదల జీవితాలకు పెన్నిధిగా అన్నదాతలకు ఆశాదిపంగా, ఆడపడుచులకు అన్నగా, బడుగుల సంక్షేమానికి ఎన్నో పథకాలు తెచ్చిన వ్యక్తి రామారావు . సమాజమే దేవాలయం అంటూ ప్రజలే దేవుడనే సిద్ధాంతంతో పార్టీ ప్రస్థానం కొనసాగింది. ఢిల్లీ పెద్దల పెత్తనం పెరిగిపోయిన సమయంలో తెలుగువారి ఆత్మగౌరవాణి కాపాడాలనే ఉద్దేశంతో తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగు యువత కార్యనిర్వక కార్యదర్శి ఆవుల పవన్ కుమార్ మాట్లాడుతూ అగ్రకులాలకే పరిమితమైన రాజకీయ అధికారాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు చేరువయ్యలా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడపడుచులకు ఆస్తులలో సమాన హక్కు తో పాటు విద్య, ఉపాధి,రాజకీయ, సామాజిక రంగాల్లో అవకాశం కల్పించింది. అంతేకాక ఆకలితో అనుమతిస్తున్న పేదలకు కిలో రెండు రూపాయలకే బియ్యం, పేదలకు పక్కా ఇల్లు పథకాలు ప్రవేశపెట్టినా మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని నాయకులు కొనియాడారు. చెన్నూరు ప్రాథమిక వైద్యశాలలో మండల నాయకుల ఆధ్వర్యంలో రోగులకు బ్రెడ్లు జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ సర్పంచ్ రెడ్డి, మండల ఐటీడీపీ మణికంఠ, బీసీ నాయకులు సుబ్రహ్మణ్యం, సుధాకర్ రెడ్డి, ఆకుల చలపతి, భవాని ఆచారి, పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.