NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీదే అధికారం

1 min read

మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం  మండల పరిధిలోని కల్లుదేవకుంట గ్రామంలో క్లస్టర్ ఇంచార్జ్ ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా టిడిపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు, రైతులకు, యువతకు ఇస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. వైసిపి ప్రభుత్వం పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మంత్రాలయం నియోజకవర్గం లో మూడుసార్లు గెలిచిన బాలనాగిరెడ్డి ఎలాంటి పనులు అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఒట్టి మాటలు చెప్తున్నారు కానీ చేసింది ఏమీ లేదని రానున్న రోజుల్లో ప్రజలు వైసిపి నాయకులను ఇంటికి పంపుతారని అన్నారు. ఈసారి కచ్చితంగా నేను గెలుస్తాను మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని  అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జిలు యల్లారెడ్డి, చావిడి వెంకటేష్,బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి, కల్లుదేవకుంట గ్రామ నాయకులు జగన్నాథ్ రెడ్డి, రాగన్న, భీమయ్య, అబ్రహం, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి యోబు, వగరూరు అబ్దుల్, గోపాల్, చిలకలదోన మాజీ సర్పంచ్ హనుమంతు, తిక్కయ్య, తిమ్మాపురం కేసన్న, వట్టప్ప  నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

About Author