PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరోయిన్ తో తెలుగు హీరో నిశ్చితార్థం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ టాలీవుడ్ హీరో ఆది పినిశెట్టి‌ నిశ్చితార్థం హీరోయిన్ నిక్కీ గల్రానీ‌తో మార్చి 24న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఆది పినిశెట్టి ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘నా జీవితంలో చెప్పుకోదగ్గ మంచి విషయం ఏంటంటే.. కొన్నేళ్ల క్రితం మేం ఒకరికీ, మరొకరం పరిచయం అయ్యాం. ఇరు కుటుంబాల సమక్షంలో మా నిశ్చితార్థం మార్చి 24న ఘనంగా జరిగింది. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. అందుకు మీరందరూ ఆశీస్సులు, దీవెనలు అందించాలి’’ అని ఆది పినిశెట్టి ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొన్నాడు. ‘యాగవరాయినుం నా కాక్క’ అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి సరసన నిక్కీ నటించింది.

                                    

About Author