తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి : ఎమ్మెల్యే
1 min read– 176 వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని 17వ వార్డులో శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఒకరు. కంపెనీ దొరతన్నాన్ని ఎదిరించి వీరమరణం పొందారు.అనంతరం కర్నూలు మున్సిపాలిటీ 3 వ డివిజన్ పారిశుద్ధ కార్మికులకు బెడ్ షీట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో 17వ వార్డు కార్పొరేటర్ కైపా పద్మలత రెడ్డి, కెవి సుబ్బారెడ్డి, శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి ఏ క్యాంప్, చాణక్యపురి కాలనీ అసోసియేషన్, సిహెచ్ మద్దయ్య, ధనుంజయ ఆచారి, కేదార్ నాథ్, జోగి వెంకట్రామిరెడ్డి, విజయ మనోహర్ రెడ్డి, ప్రతాపరెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.