తెలుగు భాష ఉద్యమకారుడు గిడుగు రామమూర్తి పంతులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గిడుగు రామమూర్తి పంతులు జన్మదినోత్సవ సందర్భంగా తెలుగు భాషా వారోత్సవాలలో భాగంగా కర్నూలు ప్రాంతీయ అధికారి వారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశ్యించి మాట్లాడుతూ కర్నూలు ప్రాంతీయ అధికారి శ్రీ టేకి వెంకటరామం , తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసిన తెలుగు భాష ఉద్యమకారుడు, సంఘసంస్కర్త, చరిత్రకారుడు, బహుభాషా కోవిదుడు, తెలుగు వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింప చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు మన శ్రీ గిడుగు రామమూర్తి పంతులు సేవలను కొనియాడారు. మాతృ భాష గొప్పదనాన్ని, ముఖ్యంగా తెలుగు వ్యావహారిక పదజాలం లోని గొప్పదనాన్ని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అంతేగాక, కార్యాలయ ఉత్తర, ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలని, మాతృ భాషను గౌరవించాలని ఆకాంక్షించారు.