NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భాష్యం స్కూల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంగళవారం ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  ముందుగా గిడుగు రామూర్తి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ తెలుగు భాషను గ్రంధికం నుంచి ఆధునికముగా మార్చి సులభతరం చేసిన మహనీయులు గిడుగు రామూర్తి అన్నారు. తెలుగు భాషకు కీర్తిని తెచ్చిన వ్యక్తి అని తెలిపారు. తెలుగు భాషను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. అనంతరం నిర్వహించిన పోటీలో గెలుపొందిన వారికి బహుమతు అందచేశారు.. అలాగే జాతీయ క్రీడా దినోత్సవ  వేడుకలను జరుపుకున్నారు. క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి  ప్రిన్సిపాల్ మాచాని కవిత  చేతులమీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయ బృందం విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author