శ్రీ ఛైతన్య పాఠశాలలో ఘనంగా తెలుగు భాషాదినోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక బుధవారపేట లోని శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషాదినోత్సవం ఎంతో ఘనంగా జరిగిందని పాఠశాల ప్రధానాచార్యులు రాఘవ లక్ష్మి తెలిపారు .మంగళవారం పాఠశాలలో తెలుగు భాషాదినోత్సవం కార్యక్రమం జరిగింది .ఈ కార్యక్రమం నకు ముఖ్య అథితులుగా శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజిఏం సురేష్ ,ప్రముఖ కవి ఎలమర్తి రమణయ్య ,తెలుగు ప్రొఫెసర్ డా .అన్వర్ హుస్సేన్ ,పాఠశాల ప్రాంతీయ బాధ్యులు వి .వెంకటేష్ ,కోఆర్డినేటర్ రమణ పాల్గొన్నారు .ఈ కార్యక్రమం లో ఏజిఏం సురేష్ మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పంతులు గారు మొదట ఉపాధ్యాయ వృత్తి చేపట్టి తదనంతరం తెలుగు బాషా పురోభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడిని గురించి కొనియాడారు .ప్రముఖ కవి ఎలమర్తి రమణయ్య మాట్లాడుతూ తెలుగు బాష తీయనైనది మరియు మదురమైనదని తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు .అష్టదిగ్గజ కవుల వేషధారణ అందరిని ఆకట్టుకుంది .అనంతరం పరమానందయ్య శిష్యుల నాటిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి .పాఠశాల ప్రాంతీయ బాద్యులు వి .వెంకటేష్ ప్రసంగించారు .ఈ కార్యక్రమం లో కోఆర్డినేటర్ రమణ ,డీన్ వీరయ్య ,తెలుగు ఉపాధ్యాయులు రంగస్వామి ,అయ్యమ్మ ,ఉపాధ్యాయులు ,తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు .