PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గురుకులంలో తెలుగు భాష వారోత్సవాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, పత్తికొండ:  తెలుగు భాష వారోత్సవాలు గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ముగింపు రోజైన గురువారం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. తెలుగు భాష గొప్పతనం ఉట్టిపడేలా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు కళారూపాలను ప్రదర్శించారు. మన మాతృభాష తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ స్వాతి అన్నారు.  ఈ సందర్భంగా  తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో గురుకుల ఉపాధ్యాయ బృందం రామాంజనేయులు p మునయ్య రవికుమార్ మధుసూదన్ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author