సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం
1 min readఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ నియమితులుకాబోతున్నారు. సుప్రీం కోర్టు 48 వ న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు ఎస్ ఏ బాబ్డే కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డే ఏప్రిల్ 23న పదవి విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 2022 ఆగస్టు 26 వరకు ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ పదవిలో కొనసాగుతారు. చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎన్వి రమణ తెలుగు వారు కావడం గమనార్హం.