వ్యాపారస్తులకు అనుమతి ఇవ్వని ఆలయ ఈఓ..
1 min readపల్లెవెలుగు వెబ్: శ్రీశైలంలోని లలిత అంబికా షాపింగ్ కాంప్లెక్స్ తరలింపు విషయం పై ఈవో తో మాట్లాడేందుకు వెళ్లిన వ్యాపారస్తులకు నిరాశే ఎదురైంది. దేవాలయం ఈఓ కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో మార్కెట్ అసోసియేషన్ సభ్యులను సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటూ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.