పోలీసు స్పందన కార్యక్రమం తాత్కలిక రద్దు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం ( మార్చి 13 న) కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో జరగబోయే ” స్పందన కార్యక్రమము”ను తాత్కలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం(MLC) స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంగా పోలీసు అధికారులు అందుబాటులో లేకపోవడం వలన స్పందన కార్యక్రమం వాయిదా పడింది. కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ , ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే జిల్లా ఎస్పీ గారి స్పందన కార్యక్రమం కు రావొద్దని తెలిపారు. జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.వచ్చే సోమవారం(మార్చి 20) నుండి “ స్పందన కార్యక్రమం” యధావిధిగా కర్నూలు (DPO) జిల్లా పోలీసు కార్యాలయం నందు జరుగును ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.