PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పది, ఇంటర్​ పరీక్షలు రద్దు చేయండి

1 min read

జేసీకి వినతిపత్రం అందజేసిన టీఎన్​ఎస్​ఎఫ్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కరోన థర్డ్​వేవ్​ వస్తుందని శాస్ర్తవేత్తలు, వైద్యనిపుణులు పేర్కొంటున్నారని, ఈ క్రమంలో పది, ఇంటర్​ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం సరికాదని టీఎన్​ఎస్​ఎఫ్​ కర్నూలు పార్లమెంట్​ కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే పది, ఇంటర్​ పరీక్షలు రద్దు చేయాలని కోరారు. ఇందుకు డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ , పాణ్యం మాజీ ఎమ్మెల్యేగౌరు చరితరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ , నాగేంద్ర కుమార్ , పోతురాజు రవి కుమార్ , ఆకేపోగు ప్రభాకర్ , దరూరు జేమ్స్ , సత్రం రామకృష్ణుడు , తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు రెడ్డిపోగు బజారన్న తదితరులు మద్దతు ఇచ్చారు. అనంతరం జాయింట్​ కలెక్టర్​ రాంసుందర్​ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కరోన బారిన పడి మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు ఎక్స్​గ్రేషియా చెల్లించాలని, సాదారణ మరణాలకు రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అంతేకాక ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్​ వేయాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు రాజు యాదవ్ , జలాల్ , ఉస్మాన్, రాజశేఖర్, బజార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో హన్మంతరావు చౌదరి, బొగ్గుల రాజశేఖర్ గారు, జలీల్ బాషా తదితరులు పాల్గొన్నారు.

About Author