ప్రశాంతంగా పది పరీక్షలు …డీఈఓ శ్యాముల్ పాల్
1 min read
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈఓ
హొశగుందలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి విలేకరులతో మాట్లాడుతున్న డీఈఓ శ్యాముల్ పాల్
హొళగుంద, న్యూస్ నేడు: ఇక్కడ ఉన్న నాలుగు వది పరీక్షా కేంద్రాలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండ పరీక్షలు ప్రశాంతంగా వ్రాస్తున్నారని డీఈఓ శ్యాముల్ పాల్ అన్నారు. సోమవారం ఆయన స్థానిక కేజీబీవీ, జూనియర్ కాలే.తో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాలను అకస్మికంగ తనిఖీ చేశారు. కేంద్రాల్లోని గదులన్ని తిరిగి క్షుణంగా పరిశీలించారు. వరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, వైద్య సౌకర్యాలు, డెస్క్లు అందుబాటులో ఉన్నాయా లేవా తదితర వాటి గురించి పరిశీలించారు. మాస్ కాఫింగ్, కాఫింగ్లు జరిగితే చర్యలు తీసుకుంటామని పరీక్షలకు వకడ్బందీగా నిర్వహించాలని పరీక్ష కేంద్రాల చీఫ్ కు, ఇన్విజిలేటర్లుకు సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాటాడుతూ కేవలం జడ్పీ హైస్కూల్లో మాత్రం మొదటి రోజు డెస్క్ సమస్య వచ్చినా వెంటనే సమస్య పరిస్కారమైందన్నారు. ఈ పాఠశాలలో పాత డెస్క్ కు సంబంధించి ఫిర్యాదు ఉందని పరీక్షలనంతర సమగ్ర విచారణ చేస్తామన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. నాలుగు కేంద్రాలలో సోమవారం మ్యాథ్స్ పరీక్ష జరగగ 718 మందికి గాను 28 పరీక్షకు గైరాజరవగ 690 మంది హాజరయ్యారు. ఆయనతో పాటు ఎంఈఓ-1, 2 సత్యనారాయణ, జగన్నాధంలు ఉన్నారు.
