పోలీస్ స్టేషన్లకు చేరిన ‘పది ప్రశ్నపత్రాలు’..
1 min read
ఈనెల 17 నుంచి పది పరీక్షలు-అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఎంఈఓ లు..
నందికొట్కూరు (మిడుతూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు,నందికొట్కూరు పగిడ్యాల,జూపాడు బంగ్లా మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు పదవ తరగతి పరీక్ష ప్రశ్నా పత్రాలు అధికారులు భద్రపరిచారు.సోమవారం సెట్ -1,మంగళవారం సెట్-2 పరీక్షా ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్లో భద్రపరచినట్లు మిడుతూరు ఎంఈఓ లు ఫైజున్నిసా బేగం, శ్రీనాథ్ తెలిపారు.మిడుతూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాల,ఏపీ మోడల్ పాఠశాల,కడుమూరు జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈనెల 17 నుంచి 31వ తేదీ వరకు ఆరు సబ్జెక్టులు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయి.ప్రతి పరీక్ష కేంద్రంలో 160 మంది విద్యార్థులు హాజరవుతారని జరుగుతాయని ఎంఈఓ-2 శ్రీనాథ్ తెలిపారు.మిడుతూరు పోలీస్ స్టేషన్ లో పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్లు మరియు డిపార్టుమెంట్ అధికారులు మల్లికార్జున నాయక్,రవి ప్రకాష్,మోహన్ రావ్,చిన్న రాజు,సుబ్రహ్మణ్యం,జెమినీ గణేష్ మరియు పోలీస్ బందోబస్తు నడుమ ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు.అదే విధంగా నందికొట్కూరులో మండలంలో 1,324 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పట్టణంలో ఆరు పరీక్ష కేంద్రాలు వాటిలో జిల్లా పరిషత్,జడ్పీ బాలికల పాఠశాల,శ్రీ నవనంది, విజయవాణి,శ్రీ చైతన్య,జడ్పీ బాలుర పాఠశాల,బ్రాహ్మణ కొట్కూరు జడ్పీహెచ్ఎస్ అదే విధంగా పగిడ్యాల మండలంలో 460 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.పగిడాల జడ్పీహెచ్ఎస్,లక్ష్మాపురం బాలికల గురుకుల పాఠశాల, ముచ్చుమర్రి జడ్పీహెచ్ఎస్ లో పరీక్షలు జరుగుతున్నాయని రెండు మండలాల ఎంఈఓ పి. సుభాన్ తెలిపారు. విద్యార్థులకు అన్ని విధాలుగా పరీక్షలు రాసేందుకు టేబుళ్లు, విద్యుత్తు,నీటి సరఫరా, మెడికల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంఈఓ సుభాన్ తెలిపారు.ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరిచినట్లు ఆయన తెలిపారు.
