ఫ్లిప్ కార్ట్ లో వాటా కొన్న టెన్సెంట్ !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత ఇ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ‘ఫ్లిప్‌కార్ట్’ ఈక్విటీలో చైనా టెక్ దిగ్గజం టెన్సెంట్ 0.72 శాతం వాటా తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్నీ బన్సాల్ నుంచి టెన్సెంట్ ఈ వాటాను సుమారు రూ.2,060 కోట్లకు కొనుగోలు చేసింది. యూరప్ లోని తన అనుబంధ సంస్థ టెన్సెంట్ క్లౌడ్ యూరప్ బీవీ ద్వారా టెన్సెంట్ ఈ వాటా కొనుగోలు చేసింది. భారత కంపెనీల్లో చైనా కంపెనీల పెట్టుబడులపై ఉన్న ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని టెన్సెంట్ ఈ మార్గాన్ని ఎంచుకుంది.