NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో టెండర్.. బహిరంగ వేలం పాట..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : కైకలూరు మండలం, కొల్లేటికోట గ్రామం లో వేంచేసియున్న  శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం నందు  ఈరోజు మధ్యాహ్నం గం.3.00 లకు  నటరాజన్ షణ్ముగం, కార్యనిర్వహణాధి కారి  భీమేశ్వర స్వామి వారి దేవస్థానం గుడివాడ వారి పర్యవేక్షణలో సదరు కార్యనిర్వహణాధికారి కె.వి. గోపాల రావు  సమక్షంలో  అమ్మవారి దేవాలయ ప్రాంగణంలోకి  వచ్చు భక్తులకు షామియానా వంట పాత్రలు సప్ప్లై చేయు లైసెన్స్ హక్కునకు 2. భక్తులచే సమర్పించబడు తలనీలాలు ప్రోగు చేసుకొనుపోవు లైసెన్స్ హక్కునకు, 3. భక్తుల పాద రక్షలు బద్రపరచి రుసుము తీసుకొను లైసెన్స్ హక్కునకు, గాను టెండర్ కామ్ బహిరంగ వేలం పాటలు నిర్వహించగ,  1. శ్రీ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలోకి  వచ్చు భక్తులకు షామియానా వంట పాత్రలు సప్ప్లై చేయు లైసెన్స్ హక్కునకు గత సంవత్సరం పాట రూ. 2,80,500/-లు కాగా ఈ సంవత్సరం పాట మొత్తము  రూ.6,11,000/-ఆదాయం వచ్చినదని, 2.భక్తులచే సమర్పించబడు తలనీలాలు ప్రోగు చేసుకొనుపోవు లైసెన్స్ హక్కునకు గత సంవత్సరం పాట రూ. 49,720/-లు కాగా ఈ సంవత్సరం పాట మొత్తము రూ.51,000/-ఆదాయం వచ్చినదని మరియు 3. భక్తుల పాద రక్షలు బద్రపరచి రుసుము తీసుకొను లైసెన్స్ హక్కునకు గత సంవత్సరం పాట రూ. 22,000/-లు కాగా ఈ సంవత్సరం పాట మొత్తము రూ.30,000/- లు ఆదాయం వచ్చినది  అని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. గోపాల రావు ఒక  ప్రకటనలో తెలియజేసియున్నారు. ఈ కార్యక్రమంలో  ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు బలే సారంగధర , శ్రీ బలే నరసింహ రావు గారు, ఉడిముడి సుబ్బరాజు,  మద్దాల సుబ్బలక్ష్మి , ఇంటి ఇందిరమ్మ , పాల్గొనియున్నారు అని ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి. గోపాల రావు  ఒక  ప్రకటనలో తెలియజేసియున్నారు.

About Author