పది లక్షల ఉద్యోగాలు.. మహా బూటకపు ప్రకటన !
1 min read
పల్లెవెలుగువెబ్ : రానున్న ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన మహా బూటకమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇది కేవలం బూటకపు ప్రభుత్వం కాదని, మహా బూటకపు ప్రభుత్వమని ఆరోపించారు. ఉద్యోగ నియామకాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంతో రాహుల్ ఘాటుగా స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు.