NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రహ్మంగారి మ‌ఠం వ‌ద్ద టెన్షన్.. అధ్యక్షుడిపై దాడికి య‌త్నం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌డ‌ప జిల్లా బ్రహ్మంగారి మ‌ఠం వ‌ద్ద టెన్షన్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. మ‌ఠాధిప‌తి ఎంపిక‌లో ఇరువ‌ర్గాల మ‌ధ్య ఉన్న వివాదం ముదిరి పాకాన ప‌డింది. విశ్వబ్రాహ్మణ సంఘం చైర్మన్ శ్రీకాంత్ ఆచారిని మ‌ఠం నాయ‌కులు అడ్డుకున్నారు. మ‌ఠం వివాదం మీద మాట్లాడుతున్న శ్రీకాంత్ ఆచారి పై దాడి చేసేందుకు మ‌ఠం నాయ‌కులు య‌త్నించారు. పోలీసులు జోక్యం చేసుకుని.. గొడ‌వ‌ను స‌ద్దుమ‌ణిగేలా చేశారు. పూర్వపు మ‌ఠాధిప‌తి వీర‌భోగ వ‌సంత వెంక‌టేశ్వర స్వామి క‌రోన‌తో శివైక్యం చెంద‌డంతో.. పెద్ద భార్య కుమారుడు వెంక‌టాద్రి స్వామి, రెండో భార్య కుమారుడు గోవింద స్వామి మ‌ధ్య పోటీ నెల‌కొంది.

About Author