చార్మినార్ వద్ద టెన్షన్.. టెన్షన్
1 min read
పల్లెవెలుగువెబ్ : మహ్మాద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతలు నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ‍్యలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. వారి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక‍్రవారం దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పాతబస్తీలోని చార్మినార్ వద్ద టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. శుక‍్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ముస్లింలు ఆందోళనకు దిగారు. మహ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాలు నినాదాలు చేస్తూ మక్కా మసీద్ నుంచి చార్మినార్ వరకు ర్యాలీ తీశాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చార్మినార్ వద్ద పోలీసు బలగాలు భారీ సంఖ్యలో మోహరించాయి.