గుంటూరు జిన్నా టవర్ వద్ద ఉద్రిక్తత !
1 min read
పల్లెవెలుగువెబ్ : గుంటూరు నగరంలోని జిన్నా టవర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. హిమానీ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ మౌన దీక్షకు దిగింది. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు దీక్షలో పాల్గొన్నారు. జిన్నా టవర్ ఎదురుగానే గాంధీ విగ్రహం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిన్నా టవర్‌కు భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. జిన్నా టవర్ పేరు మార్చాలనే డిమాండ్ లేవనెత్తారు. బీజేపీ నిరసన దీక్షతో పోలీసులు అప్రమత్తమయ్యారు.