PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత !

1 min read

పల్లెవెలుగువెబ్ : కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించాయి. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. విద్యార్థులు గేట్లు ఎక్కి కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని 200 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. 2.35 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

     

About Author