NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ళ్యాణ‌దుర్గం పోలీస్ స్టేష‌న్ ఎదుట ఉద్రిక్త‌త‌.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ ఎదుట‌ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి ఉషాశ్రీచ‌ర‌ణ్ స్వాగ‌త కార్య‌క్ర‌మం ఏర్పాటు సంద‌ర్భంగా భారీగా ప‌ట్ట‌ణంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు కార‌ణంగా ఓ చిన్నారి ఆస్ప‌త్రికి వెళ్ల‌లేక మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని టీడీపీ నేత ఉమామ‌హేశ్వ‌ర‌నాయుడు పరామర్శించారు. అనంతరం కళ్యాణదుర్గం లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట‌ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉమామహేశ్వరనాయుడు ని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలుగుదేశం కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై తెదేపా నాయకులను పోలీసులు విడుదల చేశారు.

                                           

About Author