PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో…ఉద్రిక్తత..

1 min read

ఆరోపణలపై చర్చకు రావాలని… లోకేష్​కు సవాల్​ విసిరిన ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్​

  •  యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన ఎమ్మెల్యే
  • అరెస్టు చేసిన టు టౌన్​ పోలీసులు..

పల్లెవెలుగు:భూకబ్జా చేశానంటూ… తనపై ఆరోపణలు చేసిన నారాలోకేష్​… చర్చకు సిద్ధమా.. అని సవాల్​ విసిరారు కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​.  సోమవారం ఎస్టీబీసీ కళాశాల మైదానం నుంచి పాదయాత్ర ప్రారంభించిన నారాలోకేష్​… మున్సిపల్​ రోడ్డు, పాత బస్టాండ్​ మీదుగా ఉస్మానియా కళాశాల వైపు నడుస్తున్నారు.  మార్గమధ్యలో 10వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ తనపై ఆరోపణలు చేసిన నారా లోకేష్​ …నిరూపించి వెళ్లాలని డిమాండ్​ చేస్తూ… ఖురాన్​ పట్టుకుని రోడ్డుపై నిరసనకు దిగారు. బుధవార పేటలో సర్వే నంబరు 219/ఏలో, దిన్నెదేవరపాడులో సర్వేనెంబరు 19లో రూ.600 కోట్లు విలువ చేసే భూమిని కబ్జా చేశానని తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిన నారాలోకేష్​… నిరూపించి వెళ్లాలని రోడ్డుపై బైఠాయించారు. యువగళం పాదయాత్ర  సమీపిస్తున్న తరుణంలో.. టు టౌన్​ పోలీసులు ఎంత చెప్పినా వినని ఎమ్మెల్యే, ఆయన అనుచరులను అరెస్టు చేశారు. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

About Author