టెన్త్ పేపర్స్ లీక్.. 60 మంది పై కేసు నమోదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో పగడ్బందీగా టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కొన్నిచోట్ల చిన్న సంఘటనలను రాజకీయంగా వివాదం చేశారని విమర్శించారు. టీడీపీ హయాంలో పేపర్లు లీక్, మాస్ కాపీయింగ్ చేసినా చర్యలు లేవన్నారు. తాము అన్ని విభాగాలను అలెర్ట్ చేసి చర్యలు చేపట్టామని తెలిపారు. 60 మందిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతిపక్షాల అల్లరి చూస్తుంటే అక్రమార్కులను ప్రోత్సహించినట్లుగా ఉందని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.