పదో తరగతి పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి: ఎస్పీ హర్షవర్ధన్ రాజు
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: పదవతరగతి పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐ పి ఎస్ గారు పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణం లోని ప్రభుత్వ జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10 వ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ప్రశాంతంగా, ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తాము నేర్చుకున్న అంశాలను సమాధానాలుగా రాసి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్ట బందోబస్త్ ఏర్పాటు..చెయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.పరీక్ష కేంద్రాలు పర్యవేక్షించడానికి పెట్రోలింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు..పరీక్షా కేంద్రాలవద్ద ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీ భద్రత ఏర్పాటు చేస్తామన్నారు..అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు .అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు..పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేసి జిరాక్స్ సెంటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసుఅధికారులు తదితరులు పాల్గొన్నారు.