పదవ తరగతి విద్యార్థుల జీవితాలతో అధికారులు ఆటలాడటం తగదు
1 min read
పదవ తరగతి తెలుగు పరీక్ష పేపర్ ను ఆలస్యంగా ఇచ్చినటువంటి చీఫ్ స్కాడ్ మరియు ఇన్విజిలేటర్ల ను సస్పెండ్ చేయాలి
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షల మొదలైన వేళ ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాలలో పదవ తరగతి పరీక్షలు17 -3-2025 తేదీ తెలుగు పరీక్ష పదవ తరగతి విద్యార్థులు రాయడం విద్యార్థులు పరీక్షకు సరైన సమయానికి వచ్చిన ఆ పరీక్షలకు బాధ్యత తీసుకున్నటువంటి వారు పరీక్షలు 9:30 నిమిషాలకు ఇవ్వాల్సినటువంటి తెలుగు పేపర్ 10 గంటలకు అంటే 30 నిముషాలు ఆలస్యంగా ఇవ్వడం జరిగింది ఇలా ఇవ్వడం వలన విద్యార్థులు చాలా ఇబ్బందులు పడడం టెన్షన్ గురికావడం జరిగింది వారు సంవత్సరం మొత్తం రోజులు చదివితే ఈ మూడు గంటలు మాత్రమే ఎగ్జామ్ రాయడం జరుగుతుంది ఈ మూడు గంటల్లో పరీక్షల అధికారుల నిర్లక్ష్యం వలన విద్యార్థులకు సమయం సరిపోక టెన్షన్ పడిపోవడం జరిగిందని ఈ విధంగా పరీక్షల చీఫ్ ఇన్విజిలేటర్స్ అధికారలు నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు తము పరీక్షలో మానసిక ఒత్తిడి టెన్షన్ పడడం జరిగిందని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తూ ఉంటే ఎమ్మిగనూర్ ప్రభుత్వ బాలురు కళాశాలలో ఉన్నటువంటి పరీక్షల విభాగం అధికారులు మాత్రం విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులైన మేము హిందీ పరీక్ష రోజున విద్యార్థులను అడిగి తెలుసుకోగా విద్యార్థులు తెలుగు రోజున పేపర్ 30 నిముషాలు ఆలస్యగా ఇవ్వడం వలన మేము చాలా ఇబ్బందులు పడడం జరిగిందాని ఎక్కువ సమయం ఇవ్వలేదు అని విద్యార్థులు అన్నారు ఇలాంటివి పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు పరీక్షల చీఫ్ సూపర్డెంట్ మరియు ఇన్విజిలేటర్ల పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని పి ఎస్ ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్ ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ లు డిమాండ్ చేశారు.