పదవ తరగతి విద్యార్థులు కౌన్సెలర్ల సేవలు సద్వినియోగం చేసుకోవాలి
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి : పదవ తరగతి పరీక్షల సమయంలో విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి మరియు మానసిక ఇబ్బందులు కలిగిన యెడల వారు సమస్యల నుంచి బయట పడటం కొరకుకౌన్సిలర్ల సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి రాఘవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నా వెంటనే తల్లిదండ్రులు గమనించి కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. కౌన్సిలర్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు., విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ఎలాంటి సమస్యలు వచ్చిన యెడల క్రింద కనపరచిన కౌన్సెలర్ల సెల్ నంబరులకు సంప్రదించ వలెనని అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ వై రాఘవ రెడ్డి తెలిపారు. క్రింద కనబరిచిన కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.
భార్గవి (ఫిమేల్ కౌన్సిలర్ ) :- 9581173160
శ్రీ లత (ఫిమేల్ కౌన్సిలర్ ) :- 9059869829
ఉరుకుంద (మేల్ కౌన్సిలర్) :- 9985116383
సుధాకర్ (మేల్ కౌన్సిలర్):- 9985464294