అనంతలో ఘోర రోడ్డు ప్రమాదం
1 min read
అనంతపురం జిల్లా కనగానిపల్లి మండలంలోని మామిళ్లపల్లి జాతీయ రహదారి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహరాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన ప్రైవేటు బస్సు బెంగుళూరు వెళ్తోంది. మామిళ్లపల్లి సమీపంలోకి రాగానే… నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారు. బస్సు జాతీయ రహదారి మీద నుంచి పక్కకు దూసుకెళ్లింది. దీంతో బస్సు బోల్తాపడింది. బస్సు కింద పడి ఒకరు మృతిచెందారు. బస్సులో ఉన్న మరో 30 మంది కి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.