PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘోర రోడ్డు ప్రమాదం..

1 min read
errible-road-accident-in-kurnool

errible-road-accident-in-kurnool

– డివైడర్​ను ఢీకొన్న ‘టెంపో’… వెనువెంటనే లారీ ఢీకొన్న వైనం
– చిత్తూరు, కడప జిల్లాల వాసులు 14 మంది మృతి.. నలుగురికి తీవ్రగాయాలు
– ఘటనా స్థలిని పరిశీలించిన కలెక్టర్​, ఎస్పీ
– క్షతగాత్రులకు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
– ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​

పల్లెవెలుగు, కర్నూలు (వెల్దుర్తి)
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదార్​పురం వద్ద హైదరాబాద్​– బెంగుళూరు జాతీయ రహదారి 44 పై ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది మృతులు (8 మంది మహిళలు, 5మంది పురుషులు, చిన్న బాలుడు) అక్కడికక్కడే చనిపోగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలిని కర్నూలు జిల్లా కలెక్టర్​ జి. వీరపాండియన్​, ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప పరిశీలించారు. మృతదేహాలను 108 అంబులెన్స్​లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు జీజీహెచ్​కు తరలించారు. ఘటనా వివరాలిలా ఉన్నాయి.
చిత్తూరు, కడప జిల్లా మదనపల్లికి చెందిన రెండు కుటుంబాల వారు 18 మంది బెంగళూరు వైపు నుండి హైదరాబాద్ మీదుగా అజ్మీర్​కు టెంపో వాహనంలో బయలుదేరారు. ఆదివారం ఉదయం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాదార్ పురం వద్ద ( జాతీయ రహదారి నం.44) టెంపో వాహనం డివైడర్​ను ఢీ కొని.. వెనువెంటనే వరంగల్ నుండి తాడిపత్రి వైపు వెళుతున్న లారీని ఢీకొంది. ప్రమాదంలో 14 మంది అక్కడిక్కడే చనిపోయారు. మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
కలెక్టర్​, ఎస్పీ పరిశీలన
రోడ్డు ప్రమాదం తెలిసిన వెంటనే కలెక్టర్​ జి. వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ అతి వేగమో… రాత్రి కావడంతో డ్రైవర్​కు నిద్రలేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందో తెలియదు కానీ.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జీజీహెచ్​ సూపరింటెండెంట్​ నరేంద్రనాథ్​ రెడ్డి, సిబ్బందిని ఆదేశించినట్లు కలెక్టర్​ చెప్పారు. అనంతరం ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నాం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రేన్​ సాయంంతో…
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ కాపాడాలని కేకలు వేయడంతో స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన కాశీం(10), ముస్తాక్‌ (12)ను కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. టెంపో వాహనం నుజ్జునుజ్జవ్వడంతో మృతదేహాలన్నీ అందులో ఇరుక్కుపోయాయి. క్రేన్‌ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదం నుంచి బయటపడిన నలుగురు చిన్నారులు మాట్లాడలేని పరిస్థితిలో ఉండటంతో బాధితుల వివరాలు తెలియడంలేదు. వారి వద్ద లభించిన ఆధార్‌కార్డులు, ఫోన్‌ నెంబర్ల ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బాధితులు చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి ఆజ్మీర్‌ వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నాడా? లేక టెంపో వాహనం టైరు పేలి ప్రమాదం జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు, వైద్యసిబ్బంది చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు.
మృతి చెందిన వారి వివరాలు

  1. షేక్​ దస్తగిరి (50) సన్​ ఆఫ్​ లేట్​ ఇమామ్​ సాహెబ్​, బాలాజీ నగర్​, మదనపల్లి
    2.షేక్​ అమ్మాజాన్​ (35) (వైఫ్​ ఆఫ్​ దస్తగిరి)బాలాజీ నగర్​, మదనపల్లి
    3.షేక్​ షమిరిన్​ (16) (డాటర్​ ఆఫ్​ దస్తగిరి) బాలాజీ నగర్​, మదనపల్లి
    4.షేక్​ అమరిన్​(15) (డాటర్​ ఆఫ్​ దస్తగిరి) బాలాజీ నగర్​, మదనపల్లి
    5.షేక్​ రఫి (36), (సన్​ఆఫ్​ లేట్​ ఇమామ్​ సాహెబ్​) బాలాజీ నగర్​, మదనపల్లి
    6.షేక్​ మస్తాని (32), వైఫ్​ ఆఫ్​ రఫి , బాలాజీ నగర్​, మదనపల్లి
  2. షేక్​ జాఫర్​ వలి (30), సన్​ ఆఫ్​ ఇమామ్​ సాహెబ్​, బాలాజీ నగర్​, మదనపల్లి
    8.షేక్​ రోహిని (29), వైఫ్​ ఆఫ్​ జాఫర్​ వలి, బాలాజీ నగర్​, మదనపల్లి
  3. షేక్​ నౌజిరబీ(65), వైఫ్​ ఆఫ్​లేట్​ ఇమామ్​ సాహెబ్​, బాలాజీ నగర్​, మదనపల్లి
    10.షేక్​ మహ్మద్​ రిహన్​ ( ఒక సంవత్సరం) సన్​ ఆఫ్​ రఫి, బాలాజీ నగర్​, మదనపల్లి
    11,షేక్​ నౌజియా (34)డాటర్​ఆఫ్​ ఇమామ్​ సాహెబ్​,బాలాజీ నగర్​, మదనపల్లి
  4. షేన్​ అమీర్​ జాన్​(63), వైఫ్​ ఆఫ్​ షేక్​ సిరాజుద్దీన్​, పీఅండ్​ టీ కాలనీ, మదనపల్లి
  5. నజీర్​(55), సన్​ ఆఫ్​ మహబూబ్​ఖాన్​, ఈశ్వరమ్మ కాలనీ, మదనపల్లి టౌన్​ ( డ్రైవర్​ కమ్​ ఓనర్​)
  6. షేక్​ షఫీ (38), సన్​ ఆఫ్​ జాఫర్​ వలి, జగన్​ కాలనీ, మదనపల్లి టౌన్​ (డ్రైవర్​)
    గాయపడిన వారి వివరాలి
  7. షేక్​ ఖాసిఫ్​ (14), సన్​ ఆఫ్​ దస్తగిరి , బాలాజి నగర్​, మదనపల్లి,
  8. షేక్​ యాస్మిన్​ (5) డాటర్​ ఆఫ్​ రఫి, బాలాజి నగర్​, మదనపల్లి,
    3.షేక్​ ఆస్మ (8), డాటార్​ ఆఫ్​ జాఫర్​ వలి, బాలాజి నగర్​, మదనపల్లి
    4.షేక్​ ముసా ఆసిన్​(4), సన్​ ఆఫ్​ జాఫర్​ వలి, బాలాజి నగర్​, మదనపల్లి
    ఘటనా స్థలిని పరిశీలించిన కలెక్టర్​ జి.వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప

About Author