NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టెస్ట్ మ్యాచ్ .. 69 ఏళ్ల రికార్డ్ బ్రేక్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : లండ‌న్ లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్ తో జ‌రిగిన టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ, కేఎల్. రాహుల్ రికార్డు నెల‌కొల్పారు. ఈ ఓపెనింగ్ జోడి 126 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది. 69 ఏళ్ల త‌ర్వాత లార్డ్స్ మైదానంలో టెస్ట్ మ్యాచ్ లో 100 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెలకొల్పిన టీం ఇండియా ఓపెనింగ్ జోడిగా రికార్డుల‌కు ఎక్కింది. 1952లో లార్డ్స్ లో జ‌రిగిన టెస్టు మ్యాచ్ లో భార‌త్ త‌ర‌పున చివ‌రిసారిగా వినోద్ మ‌న్కడ్-పంక‌జ్ రాయ్ ల జోడి 100 ప‌రుగుల పైగా భాగ‌స్వామ్యాన్ని నెలకొల్సింది. ఆ రికార్డును రాహుల్, రోహిత్ పార్ట్నర్ షిప్ బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ 83 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. 145 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ తో 83 ప‌ర‌గులు సాధించాడు.

About Author