టెస్ట్ మ్యాచ్ చచ్చిపోతుంది !
1 min readపల్లెవెలుగువెబ్ : టెస్టు క్రికెట్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటితరం క్రికెటర్లు టి20 క్రికెట్ ఆడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారని.. దీనివల్ల టెస్టు క్రికెట్ చనిపోయే దశలో ఉందంటూ పేర్కొన్నాడు. ”టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది. ప్రజలు టి20 క్రికెట్ ఎక్కువగా చూడాలనుకుంటున్నారు, టి20 ఫార్మాట్‌లో ఆడటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో ఆటగాళ్లు వన్డేల కంటే టి20లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. ఒక్కరోజు టి20 ఆడితే రూ.50 లక్షలు వస్తున్నప్పుడు.. ఐదు రోజుల క్రికెట్ ఆడి రూ. 5 లక్షల ఎందుకు తీసుకోవాలనుకుంటారు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు సైతం ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఒక్క సీజన్ కోసం రూ.7 నుంచి రూ.10 కోట్ల వరకు అందుకుంటున్నారు. దీంతో వన్డేలకు కూడా ఆదరణ తగ్గుతోంది. టి20 ఫార్మాట్‌కు అలవాటు పడ్డాకా 50 ఓవర్ల మ్యాచ్ కూడా టెస్ట్ మ్యాచ్‌లాగే అనిపిస్తోంది. అందుకే టీ20లదే క్రికెట్ భవిష్యత్తు అని చెప్పొచ్చు “ అని యువరాజ్ చెప్పొకొచ్చారు.