PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టెస్టింగ్ పెంచాలి..రిజల్ట్స్ ఫాస్ట్ గా ఇవ్వాలి..

1 min read
మాట్లాడుతున్న కలెక్టర్​ వీరపాండియన్​

మాట్లాడుతున్న కలెక్టర్​ వీరపాండియన్​

– నోడల్​ అధికారులను ఆదేశించిన కలెక్టర్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు కలెక్టరేట్​: జిల్లాలో కోవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేసి కోవిడ్​ను కట్టడి చేయాలని కలెక్టర్​ జి. వీరపాండియన్​ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్​ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కోవిడ్​ మేనేజ్​మెంట్​ నోడల్​ అధికారులకు ఆయన దిశానిర్దేశం ఇచ్చారు. కోవిడ్​ కేర్​ సెంటర్​, హోమ్​ ఐసోలేషన్​ లేదా హాస్పిటళ్లలో వెంటనే అడ్మిషన్​ చేయాలన్నారు. గ్రామ/వార్డ్ స్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎం లు, మెడికల్ ఆఫీసర్స్ కాంటాక్ట్ ట్రేసింగ్ లో, హోమ్ ఇసోలేషన్ పేషేంట్స్ ను పర్యవేక్షణ, ట్రీట్మెంట్ ఇవ్వడంలో శ్రద్ధ కనపరచేలా సూచించాలని నోడల్​ టీమ్స్​ను కలెక్టర్​ను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రలలో ఆక్సిజన్​, బెడ్స్​, సౌకర్యాలు, శానిటేషన్​, ఫుడ్​ తదితరవి ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలన్నారు.
బెడ్స్​ పెంచాలి.. : కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు టిడ్కో హౌసింగ్ కాలనీల కోవిడ్ కేర్ సెంటర్స్ లో బెడ్స్ పెంచాలని కలెక్టర్​ జి. వీరపాండియన్​ అధికారులను ఆదేశించారు. పాజిటివ్ పేషేంట్స్ ను అంబులెన్స్ లలో వెంటనే తరలింపు, అడ్మిషన్స్, మందులు, ఈ.సి.జి యంత్రాల ఏర్పాటు, మొబైల్ ఎక్స్ రే, శానిటేషన్, నీటి సదుపాయం, ఫుడ్, మెడికల్ కేర్ అన్నీ బాగా ఉండాలని సూచించారు.
మెడికల్​ కాలేజిలో..: కర్నూలు మెడికల్ కాలేజీలో ఉన్న వి.ఆర్.డి.ఎల్ కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్స్ లో రోజుకు 6 వేల టెస్టింగ్ జరగాలి..24 గంటల్లో టెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలి..3 షిఫ్ట్స్ లో పని చేయాలి..అవసరం అయిన ల్యాబ్ టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ స్టాఫ్, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది నియామకాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు వెంటనే చేపట్టాలని కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కు, నోడల్ టీమ్ కు కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. వీడియో కాన్ఫెరెన్సు లో పాల్గొన్న ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసి(రెవెన్యూ&అభివృద్ధి) రామసుందర్ రెడ్డి, జేసీ(సంక్షేమం) సయ్యద్ ఖాజా, మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డి.ఆర్.ఓ పుల్లయ్య, డిఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, డి.ఎం.హెచ్ఓ డా.రామగిడ్డయ్య, జిల్లా నోడల్ కమిటీల అధికారులు, ఆర్.డి. ఓ లు పాల్గొన్నారు.

About Author