PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మళ్లీ వైసీపీ వస్తే..బానిస బతుకులే..: టీజీ భరత్

1 min read

– వైసీపీ నుంచి టీడీపీలో చేరిన యువకులు

కర్నూలు, పల్లెవెలుగు:గత గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందని కర్నూల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విమర్శించారు. కర్నూలు నగరంలోని ఐదో వార్డు చిత్తారి వీధిలో పలువురు యువకులు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయాలన్నారు. మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ప్రజలు బానిసలుగా బతకాల్సిందేనన్నారు. ఈ ప్రభుత్వంలో మాటలు చెప్పడం తప్పా.. పనులు చేసేందేమి లేదని ఎద్దేవా చేశారు. సిద్ధం పోస్టర్ల వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారని మండిపడ్డారు. పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలన్నారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. నిస్వార్థంగా ప్రజా సేవ చేసే తమను దూరం చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. పార్టీలో చేరిన వారిలో పెద్ద కుమార్, విజయ్, రాజు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంఛార్జీలు బాలు, రమేష్, జనసేన పార్టీ రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.

About Author