ప్రజల కష్టాలు అల్లా తొలగించాలి: టి.జి భరత్
1 min read
కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు నగరంలోని అరోరా నగర్ లో ఉన్న గౌస్ మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ పాల్గొన్నారు. పవిత్ర రోజా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి దీక్షను విరమింప చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆయన నమాజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లా దీవెనలతో కర్నూలు ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు టి.జి భరత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మోయిన్ బాషా, జనసేన ఇంచార్జి ఆర్షద్, సమి, టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, వార్డు ఇంచార్జి శ్రీధర్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.