NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కల్లూరు అమ్మవారి శాలకు రూ.1 కోటి భారీ విరాళమిచ్చిన టి.జి భరత్

1 min read

– ప్రజా సేవలో టిజివి సంస్థలు ముందుంటాయన్న టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కల్లూరు అమ్మవారి శాల ( శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ ఆలయం)కు టిజివి సంస్థల ఛైర్మన్, కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ రూ. 1 కోటి భారీ విరాళం ఇచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి శాలకు వెళ్లిన ఆయన  అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడి అమ్మవారి శాలకు సంబంధించి నూతనంగా నిర్మించే అతిథి గృహం (శ్రీ టి.జి లక్ష్మీ వెంకటేష్ వాసవి అతిథి గృహం)  కోసం టిజివి సంస్థల తరుపున ఈ విరాళం అందించారు. ముందుగా తక్షణ పనుల నిమిత్తం రూ. 50 లక్షల చెక్కు అందించారు. త్వరలోనే మరో రూ. 50 లక్షలు ఇస్తానని టి.జి భరత్ తెలిపారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ కర్నూలులోని అమ్మవారి శాలతో పాటు కల్లూరు అమ్మవారి శాలకు వచ్చే భక్తులు ఉండేందుకు, ఫంక్షన్లు జరిగితే భక్తుల నివాసం కోసం అతిథి గృహం చాలా అవసరమన్నారు. అందుకే భక్తుల సౌకర్యార్థం తాము ముందుకు వచ్చి ఈ విరాళమిచ్చినట్లు చెప్పారు. ప్రజలకు సేవ చేయడంలో తమ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందన్నారు. వచ్చే సంవత్సరం దసరా పండుగ సమయానికంతా ఈ అతిథి గృహం భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా వేగంగా నిర్మించాలని ఆలయ కమిటీకి తాను సూచించినట్లు భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా ట్రస్టు చైర్మన్ సి. రాజశేఖర్, ఇల్లూరు రంగనాయకులు, ఇల్లూరు లక్ష్మయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author