PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు బయటకు రావాలని టి.జి భరత్ ప్రత్యేక పూజలు

1 min read

– కాళికాంబ గుడిలో 108 టెంకాయలు కొట్టిన టి.జి భరత్

– సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం.. టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుండి త్వరగా బయటకు రావాలంటూ కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని వన్ టౌన్ లో ఉన్న కాళికాంబ ఆలయంలో 4 వ వార్డు ఇంచార్జి ఊట్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో అమ్మవారికి 108 టెంకాయలు కొట్టారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో టిజి భరత్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు అంత మంచి జరగాలని ఎంతో మహిమ కలిగిన కాళికాంబను కోరుకున్నట్లు చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. సుప్రీంకోర్టులో ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ద్వారా కేసును కొట్టేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన అరెస్టును నిరసిస్తూ దీక్షలు చేయడంతో పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రజలు స్వచ్చందంగా స్పందిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా మహిళలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆయనపై నమోదు చేసిన కేసుల్లో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా క్లీన్ చీట్ తో ఆయన బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన తర్వాత రెట్టించిన ఉత్సాహంతో ఆయన పనిచేస్తారన్నారు. జైలులో ఆయన భోజనం చేసేందుకు టేబుల్ కూడా ఏర్పాటుచేయకపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని అందరం కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కలీం బాషా, పరమేష్, నాగవీరాంజనేయులు, శేషగిరిశెట్టి, మారుతీ శర్మ, రాజ్యలక్ష్మి, చేపల రమేష్, తిమ్మోజీ, తదితరులు పాల్గొన్నారు.

About Author