ఛత్రపతి శివాజీ శోభాయాత్రను ప్రారంభించిన టి.జి భరత్
1 min readబండిమెట్ట నుండి రాజ్ విహార్ వరకు సాగిన యాత్ర
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మహనీయుల చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నగరంలోని బండిమెట్టలో బాల శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం శోభాయాత్రను టి.జి భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలితా పీఠం సుబ్బుస్వామి పాల్గొన్నారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ మరాఠా సామ్రాజ్యం ఉందంటే అందుకు ఛత్రపతి శివాజీయే కారణమన్నారు. ఆయన ధైర్యం, సుపరిపాలనకు ఇచ్చిన ప్రాధాన్యం అందరికీ స్పూర్తిదాయకమన్నారు. కర్నూల్లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు జరుపుకునేందుకు విగ్రహం అందించడం తన అదృష్టంగా భావిస్తానని చెప్పారు. అంతేకాకుండా శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం, హైదరాబాద్‌లో శివాజీ విగ్రహానికి తమ టిజివి గ్రూప్స్ నుండి విరాళమిచ్చినట్లు తెలిపారు. ఈ శోభాయాత్ర బండిమెట్ట నుండి రాజ్ విహార్ కూడలి వరకు సాగింది. ఈ కార్యక్రమంలో బాల శివాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.