8వ వార్డులో పర్యటించిన టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ నగరంలోని 8వ వార్డులో పర్యటించారు. వార్డులోని దండిగేరి వీధుల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆప్యాయంగా పలుకరిస్తూ మహిళలు, వృద్ధులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా తమ వార్డులో పర్యటించిన టిజి భరత్ కు ప్రజలు వారి ఇబ్బందులు చెప్పుకున్నారు. చెత్త పన్ను దగ్గర నుండి పారిశుద్ధ్య సమస్యలు, పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరల ఇబ్బందులపై మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ సరైన నాయకుడు ఉంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇస్తే కర్నూలులో ప్రజలకు సమస్యలు లేకుండా చూసుకుంటానని చెప్పారు. టిజి భరత్ మాటలు విన్న స్థానిక ప్రజలు కచ్చితంగా రాబోయే రోజుల్లో ఓటు వేస్తామని చెప్పారు. అనంతరం వార్డులోని యువత టిజి భరత్ తో మాట్లాడుతూ పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే అయితే కర్నూలుకే పరిశ్రమలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భరత్ వార్డులోని వీధుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిశారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పారు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటును ఆలోచించి వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి పరమేష్, టిడిపి నేతలు గున్నా మార్క్, రవి, నాగార్జున, కస్తూరి వెంకటేశ్వర్లు, మంజు, మహానంది, రమేష్, జగన్నాధం, మద్దిలేటి, సురేష్, మళ్ళీ, శ్రీధర్, తదితరులు.