నెట్ బాల్ క్రీడాకారులకు సహకారమందిస్తా… టీజీ భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో నెట్ బాల్ క్రీడాకారులకు అన్నివిధాలా సహకారమందిస్తానని యువపారిశ్రామికవేత్త, కర్నూలు టిడిపి ఇంచార్జి టీజీ భరత్ అన్నారు. స్థానిక డియస్ ఎ అవుట్ డోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 9 వ అంతర్ జిల్లా నెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ సెట్ బాల్ క్రీడకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందన్నారు. నెట్ బాల్ క్రీడలో పతకాలు సాధించిన ఎందరో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయని అన్నారు. రానున్న రోజుల్లో నెట్ బాల్ క్రీడకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లభించేలా తాను కృషి చేస్తానని అన్నారు. క్రీడాకారుల్లో పోటీతత్వం నెలకొనాలని ఆయన ఆకాక్షించారు. కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరబాబు మాట్లాడుతూ జిల్లాలో నెట్ బాల్ క్రీడకు సంబంధించి విద్యార్థులకు ప్రోత్సాహం కలిగించేందుకు తాము అన్ని విధాలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్ బాల్ సంఘం సెక్రెటరీ శివరామ్, జిల్లా ఉపాధ్యక్షులు ఆనందరావు, నాగరత్నమయ్య, జిల్లా ఓలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు, క్రీడా సంఘాల ప్రతినిధులు శంకర్ గౌడ్, రేపల్లె సూర్యచంద్ర ,వేణుగోపాల్, గంగాధర్, బాలాజీ రెడ్డి , ఉపేంద్ర, సుప్రియ ,గీతాంజలి, రాలా ఫౌండేషన్ అధ్యక్షుడు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.