శ్రీ దేవి శరన్నవరాత్రి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న టీజీ వెంకటేష్ దంపతులు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటుచేసిన దేవి శరన్నవరాత్రి వేడుకల ప్రారంభ పూజా కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దేవి శరన్నవరాత్రి ప్రారంభ వేడుకలు సందర్భంగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన సామూహిక కుంకుమార్చన పూజా కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ దంపతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు మాట్లాడుతూ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నగరంలో దేవి శరన్నవరాత్రి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు .ఈ దేవి శరన్నవరాత్రి వేడుకలు ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.