నూతన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీజీ వెంకటేష్ దంపతులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పవిత్ర తుంగభద్రా నది తీరంలో సంకల్ బాగ్ వద్ద ప్రజల కోసం నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ మహాగణపతి పూజతో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి 12వ తేదీన విగ్రహ ప్రతిష్ట,ప్రాణా ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వేద పండితులు తెలిపారు. వరుసగా మూడు రోజులపాటు జరిగే ఈ పూజలు 12వ తేదీన జరిగే పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తాయని వారు తెలిపారు. మూడు రోజులు పాటు జరిగే అన్ని ముఖ్య కార్యక్రమాలలో టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొంటారని అర్చకులు తెలిపారు.