టిజి వెంకటేష్ జన్మదినం.. వివాహాలకు ఆర్థిక సహాయం:టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్: తన తండ్రి, ఎంపీ టిజి వెంకటేష్ జన్మదినం సందర్భంగా మే 16వ తేదీన వివాహం చేసుకునే నూతన వధూవరులకు ఆర్థిక సహాయం అందజేస్తామని టీజీవి సంస్థల చైర్మన్ టిజి భరత్ తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే సామూహిక వివాహాలు కరోనా, ఇతర కారణాలతో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహించలేదన్నారు. ఈ ఏడాది కూడా సామూహిక వివాహాలకు పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. ఈ నేపథ్యంలో మే నెల 16న వ్యక్తిగతంగా వివాహం చేసుకునే వారికి రూ. 60వేలు ఆర్థిక సహాయంతో పాటు పట్టు వస్త్రాలు, తాళి బొట్టు, మెట్టెలు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మే 1వ తేదీ నుండి మౌర్య ఇన్ లోని టిజిబి యూత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 10వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. ఆర్థిక సహాయం పొందాలనుకునే వధూవరులలో ఒకరు కర్నూల్ మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన వారు కానీ, పంచలింగాల, గొందిపర్ల, ఈ తాండ్రపాడు, పూలతోట, దొడ్డిపాడు, దేవమాడ గ్రామాలకు చెందిన వారై ఉండాలన్నారు. వధూవరుల వయస్సు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని టిజి భరత్ తెలిపారు.