శ్రీరామ ఆలయ నిర్మాణం కు భూమి పూజ చేసిన టీజీవీ దంపతులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని సంకల్ భాగ్ లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న శ్రీరాముని ఆలయ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం గో మాత కు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న శ్రీరామ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాసవి సత్ర సముదాయం రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు దేవకి వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, గీతా ప్రచార కమిటీ అధ్యక్షుడు డివి రమణ ,నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పల్లె చంద్రశేఖర్ శర్మ కార్యదర్శి హెచ్ కె రాజశేఖర్ రావు కోశాధికారి మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నగరంలోని సంకల్ బాగ్ లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో శ్రీరామ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం అభినందనీయమని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరిగిన ఈ ప్రాంతం పరమ పవిత్రమైందని ఆయన వివరించారు. పవిత్ర తుంగభద్రా నది తీరంలో వెలిసిన ఈ ఆలయ విశిష్టతను ఆయన వివరిస్తూ ప్రతి సంవత్సరం జరిగే ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల ద్వజారోహన రొజు, ముగింపు రోజైన చక్రస్నానం రోజు గరుడ పక్షులు ఆలయం పై ప్రదక్షణలు చేయడం ప్రపంచంలో ఎక్కడా జరగని విషయమని చెప్పారు. అలాగే సూర్యకిరణాలు స్వామి వారి పాదాల తాకడం ఈ ఆలయంలోని మరో విశిష్టత వివరించారు. తుంగ పానీయం కోటిమార్లు గంగ స్నానంతో సమానమని ఆయన వివరించారు.