సీఎంకు కృతజ్ఞతలు..
1 min read
ఉద్యోగుల బకాయిలకు రూ. 6200 కోట్లు కేటాయించడం అభినందనీయం
- ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు జిల్లా జేఏసీ చైర్మన్ వీ .సీ .హెచ్ .వెంగల్ రెడ్డి
- పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి చేతుల మీదుగా డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
కర్నూలు, న్యూస్ నేడు : వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం కర్నూలు జిల్లా తరుపున నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత చేతుల మీదుగా శుక్రవారం కర్నూలు జిల్లా అధ్యక్షలు కే,రవి ప్రకాష్ మరియు కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు జిల్లా జేఏసీ చైర్మన్ వీ .సీ .హెచ్ .వెంగల్ రెడ్డి ముఖ్యఅతిథిగా మరియు జిల్లా కార్యదర్శి,యం సి కాశన్న ఆధ్వర్యంలో డైరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రధానంగా మహిళల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం రూ. 6200 కోట్లు ఉద్యోగుల బకాయిలు చెల్లించుటకు ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి కిమరియు రాష్ట్ర ఏపీ జేఏసీ నాయకత్వానికి సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కార్యవర్గము, జిల్లా ఇన్చార్జి కార్యదర్శి కేసిహెచ్ కృష్ణుడు, అసోసియేట్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మరియు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఏపీ ఎన్జీ జిఓస్ అసోసియేషన్ కర్నూలు నగర శాఖ కార్యదర్శి రామకృష్ణ, ఏపీ ఎన్జీ జిఓస్ అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు చందన, కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ విస్తరణ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వర్ రెడ్డి, కర్నూలు జిల్లా ఫార్మసిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రంగస్వామి, రాజేష్, కమర్షియల్ టాక్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నాగరాజు, ఏపీ టైపిస్టు మరియు స్టెనోగ్రాఫర్ల సంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శంకర్ నాయక్, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, మద్దిలేటి/భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, బంగారి, మెడికల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, అధ్యక్షులు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.