ప్రమోషన్లు కల్పించినందుకు ధన్యవాదాలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ మరియు అకౌంట్స్ డైరెక్టర్ మోహన్ రావు కర్నూలుకు వచ్చిన సందర్భంగా జిల్లా ట్రెజరీ కార్యాలయం లో ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వి సి హెచ్, వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీ ఉద్యోగులైన సీనియర్ అకౌంటెంట్లకు ఎస్టీఓ లు గా మరియు ఎస్టీఓ ల కు ఏటీఓ లు గా దాదాపు 52 మందికి ప్రమోషన్లు కల్పించినందుకు డైరెక్టర్ మోహన్ రావు కి ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా సంఘ పక్షాన ధన్యవాదాలు తెలియజేయడ మైనది. అలాగే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ లో వివిధ జిల్లాలలో పనిచేయుచున్న ట్రెజరీ ఉద్యోగుల కోట భర్తీ చేయవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది.ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానాధికారి రామచంద్రరావు, ఎస్టీఓ సునీల్,మరియు ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా ఇన్చార్జి కార్యదర్శి కే సిహెచ్ కృష్ణుడు, కర్నూల్ నగర శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఎంసీ కాశన్న, ఎం రామకృష్ణ, వ్యవసాయ శాఖ ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షులు రవి ప్రకాష్, ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బంగారి, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు, ప్రభాకర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ, జనార్దన్ రెడ్డి, మరియు ట్రెజరీ ఉద్యోగులు పాల్గొన్నారు.