జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.. ఎమ్మెల్యే
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/4-11.jpg?fit=550%2C573&ssl=1)
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి:ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అధికార, అనధికార ప్రముఖులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హంగూ, ఆర్భాటాలకు దూరంగా ఉండే తనపై కొండంత ప్రేమను చూపిస్తూ తన పుట్టినరోజు వేడుకల్ని పండుగ వాతావరణంలో నిర్వహించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తన శ్రేయస్సును కాంక్షిస్తూ పరబ్రహ్మ స్వరూపమైన అన్నదాన కార్యక్రమాలను పలు వృద్దాశ్రమాలతో పాటు పలుచోట్ల విస్త్రృతంగా నిర్వహించడం తనకెంతో ఆత్మసంతృప్తిని కలిగించిందని బడేటి చంటి పేర్కొన్నారు. ఈ విధమైన సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతిఒక్కరికీ ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి అభిమానం చూపే నాయకులు, కార్యకర్తలు ఉన్న పార్టీలో తాను ఉండడం తన అదృష్టమని అన్నారు. ఇదే ఉత్సాహంతో మరింత బలాన్ని పుంజుకొని ప్రజాసేవకు పునరంకితం అవుతానని ఎమ్మెల్యే చంటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.