నగర ప్రజల సహకారానికి కృతజ్ఞతలు
1 min read
రూ.71.47 కోట్లు దాటిన ఆస్తి, ఖాళీ స్థలం పన్నులు
ఈ స్థాయిలో వసూలు చేయడం ఇదే తొలిసారి
నగరపాలక మేనేజర్ చిన్నరాముడు, ఆర్వో ఇశ్రాయోలు
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం నగరాభివృద్ధికి పన్నులు చెల్లించి సహకరించాలనే నగరపాలక సంస్థ పిలుపునకు స్పందించి, అత్యధిక సంఖ్యలో బకాయిదారులు పన్నులు చెల్లించి సహకరించిన బకాయిదారులందరికీ నగరపాలక మేనేజర్ యన్.చిన్నరాముడు, ఆర్వో ఇశ్రాయోలు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వారు నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రంతోపాటు, సి క్యాంపు, బాలాజీ నగర్, కల్లూరు వార్డు కార్యాలయంలో ఉన్న ప్రత్యేక కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మేనేజర్, ఆర్వో మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడు లేనంతగా రూ.71.47 కోట్లు (సాయంత్రం 05:45 వరకు) ఆస్తి ఖాళీ స్థలఝ పన్నులు వసూలు అవ్వడం నగరపాలక యంత్రాంగానికి సరికొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. అలాగే తాగునీటి కొళాయి చార్జీలు రూ.7.76 కోట్లు వసూలు చేయడం జరిగిందన్నారు.